కామారెడ్డి, బతుకమ్మ :
డబ్బుల కోసం వేదిస్తున్న కొడుకును రాడ్ తో కొట్టి హత్య చేసిన తండ్రిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. బుధవారం కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 19న కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్, అతని తండ్రి బాలరాజు గొడవ పడ్డారు. నిత్యం మద్యం కోసం వేదిస్తున్న కొడుకుపై కోపంతో బాలరాజు రాడ్ తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నిఖిల్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 20న మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి బుధవారం బాల్ రాజ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ రామన్, దేవునిపల్లి ఎస్సై గుండెల రాజు పాల్గొన్నారు.
