. . . ఎస్ఈ పి.వి రాజేశ్వర రావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రైతులకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందిచండమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు గరిష్ట స్థాయిలో మంజూరు చేసినట్టు నిజామాబాద్ సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ పివి రాజేశ్వర్ రావు తెలిపారు. జిల్లా పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 978 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు. పంటల కోత కాలం ముగియడంతో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యుద్ద ప్రాతిపదికన అత్యధిక సంఖ్యలో సర్వీసులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో వేగం కొనసాగుతుందని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఇతర అవసరమైన మెటిరియల్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అధికారుల సమన్వయం, సత్వర చర్యల ఫలితంగా సర్వీసుల మంజూరు ప్రక్రియ వేగవైంతమైందని ఎస్ఈ తెలిపారు.
