24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐకెపి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు తీవ్ర నష్టం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి స్వంత నిర్ణయాలు

 

. . . డొంకల్ రైతుల నిరసన

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా వరి కొనుగోలు కేంద్రాలు పనిచేయడం లేదని అందుకే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని డొంకల్ గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఐకెపి ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆత్మహత్యలే తమకు శరణ్యంగా మారుతున్నాయన్నారు. తక్షణమే ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11 న రైతులు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జరిగిన మోసాన్ని రైస్ మిల్లర్ల నిర్వాహకాలపై రైతులు కలెక్టర్ తో పాటు నిజామాబాద్ డిఆర్డిఏ పిడిని కలిసి తూకం లో జరిగిన మోసాలు నిబంధనలకు విరుద్ధంగా రైస్ మిల్లర్లు బస్తాలపై అదనపు తూకం చేస్తున్నారని డోనకల్ గ్రామానికి చెందిన రైతులు లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎంతో పారదర్శకంగా ఉంటూ ప్రభుత్వ నిబంధన ప్రకారం కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని తుంగతుర్తి ఐక్యప అధికారులు రైస్ మిల్లర్లు కలిసి కుమ్మక్కై ఆరు కాలం కష్టపడి పండించిన రైతులను నట్టేట మునిస్తున్నారని వారు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డోన్కల్ గ్రామ రైతులు మోహన్ రెడ్డి, శ్రీకాంత్ భాస్కర్, ఎల్లయ్య, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article