- భరోసాతో ఉండండి
- లక్షా 600 క్యూసెక్కుల భారీ వరద
- 15 గేట్ల ద్వారా 1,25,000 క్యూసెక్కుల నీటి విడుదల చేయించిన ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరదకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన గ్రామాలు చినూర్, వాడి గోలింగాల లింగంపల్లి తాండూర్, వెంకంపల్లి, మాటూరు మాసంపల్లి, జలాల్పూర్ ఎర్రవరం మతమాల మల్కాపురం, రుద్రారం గ్రామాలకు చెందిన మాంజీర ది పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాల రైతులు ఎగువ నుండి వస్తున్న, సింగూర్ ప్రాజెక్ట్, నుండి భారీ వరద సుమారు 65000 క్యూసెక్కులు, అలాగే మంజీరా నదిలో కలిసే పసు పేరు, 20,000 క్యూసెక్కులు మంజీరా నది, 20వేల క్యూసెక్కులు, పోచారం ప్రాజెక్టు నుండి 7500 క్యూసెక్కులు, ఇతర ప్రాంతాల నుండి ఓ పదివేల క్యూసెక్కులు, మంజీరా నది నిండా పొంగిపొర్లతో ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాల్లో పలు గ్రామాలకు చెందిన సుమారు 3000 ఎకరాల పంట పొలాలను నష్టం చేస్తున్న మాజీర నది భారీ వరదకు రైతులు తీవ్రం నష్టం వాటిల్లుతున్నారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ దిగువన ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యేతో నీటీ పారుదల శాఖ మంత్రితో, చర్చించి 15 గేట్ల ద్వారా లక్ష 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయించారు. సుమారు రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో గేట్లను ఆపకూడదని దిగువకు నీటిని విడుదల చేస్తూ ఎగువనున్న రైతులకు పంట పొలాలకు నష్టం వాటిల్లకుండా నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులను కాపాడాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశించారు. ప్రాజెక్టు నీటిమట్టం 17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీలకు నీరు చేరిందని వర్షాలు భారీగా ఉండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు నీటిని నిల్వ ఉస్తే ఎగువనం ఉన్న రైతులు నష్టపోతారని ప్రత్యేకంగా వారికి సంబంధిత శాఖ అధికారులతో, నీటిపారుదల శాఖ నిజాంసాగర్ అధికారులకు హెచ్చరించారు.
