27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నష్టపోయిన రైతంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  నాగారంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు వరి జొన్న పసుపు మొక్కజొన్న సోయా సజ్జలు పసుపు అనేక పంటలు అకాల వర్షం కు నష్టపోయి నీట మునిగాయి అని అన్నారు. ప్రజలు ఇబ్బందు  పడుతున్నారని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న మండలాలలో వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లి పంట నష్టం ఎంత జరిగిందని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, నష్టపోయిన పంట రైతులకు 50,000 నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని, గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. అనేక చోట్ల ఇండ్లు కూలిపోయి రోడ్డు పాలైన ప్రజలకు ఇండ్లు మంజూరు చేసి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.  ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజ్, బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article