30.2 C
Hyderabad

బడా రామ్ మఠ్ భూముల్లో  బస్ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ధర్నా

Farmers protest against construction of bus depot on Bada Ram Math lands

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్ కల్ రోడ్డులో ఉన్న బడా రామ్ మఠ్ కు చెందిన సాగులో ఉన్న వ్యవసాయ భూముల్లో బస్ డిపో నిర్మాణానికి ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు వేయడాన్ని నిరసిస్తూ, బడా రామ్ మఠ్ కౌలు రైతుల ఆధ్వర్యంలో శనివారం ధర్నా చౌక్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతుల కన్వీనర్ ఆకుల పాపయ్య, కో-కన్వీనర్ ముత్యాల నర్సారెడ్డి, లింగం తదితరులు మాట్లాడుతూ “గత 140 సంవత్సరాలకు పైగా మఠానికి ఎకరానికి 5 వేల రూపాయలు కౌలు చెల్లిస్తూ తాము ఈ భూములను సాగు చేసుకుంటున్నామన్నారు. ఎస్సీ, బీసీ, ఇతర కులాలకు చెందిన భూమిలేని రైతులందరూ ఈ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు.  బడా రామ్ మఠ్ వ్యవసాయ భూముల్లో దేవాదాయ శాఖ పెత్తందారీ దౌర్జన్యం నశించాలని, రెవెన్యూ శాఖ ఏకపక్ష నిర్ణయాలు సరికాదని, బడా రామ్ మఠ్ వ్యవసాయ భూముల్లో ఆర్టీసీ అక్రమ కబ్జా నశించాలని,  నాగారం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆర్టీసీ బస్సుకి కేటాయించాలని, న్యాల్ కల్ రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడుతున్నందున మరో బస్ డిపోను నాగారం ప్రాంతానికి మార్చాలని, పంట పండించే వ్యవసాయ భూములను గుంజుకోవద్దని రైతులు డిమాండ్ చేశారు. “బడా రామ్ మఠ్ భూములపై రామ్ మఠానికే అధికారం ఉందని, దేవాదాయ శాఖ పెత్తనం వద్దని రైతులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, ముత్యాల నర్సారెడ్డి, అంబదాస్, ఆకుల శ్రీనివాస్, రవి, శ్రీను , లావణ్య, లక్ష్మి, గంగమణి,రావు, లింగం, శివ, కిరణ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article