. . . బందోబస్తు మధ్య బఫర్ జోన్ లో నిర్మాణాల కూల్చివేత
నందిపేట్ బతుకమ్మ.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రం పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో పడిగే ల చెరువు ఆక్రమణలపై యంత్రాంగం కొరడా ఝులిపించింది. శనివారం ఉదయం చెరువు శిఖం భూములు అక్రమానికి గురైనట్లు గురించి పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. పడిగెల చెరువు శిఖం భూములు ఆక్రమణలపై నందిపేట్ గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు ట్రైనీ కలెక్టర్ సురేష్ పాలూరి ఆధ్వర్యంలో బఫర్ జోన్ లోని భూమిని గుర్తించి మార్కింగ్ చేసిన విషయం తెలిసిందే. బఫర్ జోన్ పరిధిలోకి చొచ్చుకొచ్చిన ఆక్రమణల జెసిబి ల సహాయం తో కూల్చివేత ప్రారంభించారు శాంతి భద్రతల దృశ్యా పటిష్ట పోలీస్ బందోబస్త్ సీఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కోందరు ఇదివరకు న్యాయస్థానం నుంచి ఆశ్రయించి స్టే పోందారు. కానీ దీనిపై జిల్లా అధికార యంత్రాంగం రెవెన్యూ, నీటిపారుదల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్టేను సవాల్ చేసే యోచనలో ఉన్నారు.

