25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతు భరోసా నిధులు జమ

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు  జిల్లాలోని 2,55,205 మంది రైతుల ఖాతాలలో రూ. 259.81 కోట్ల నిధులు జమ అయ్యాయని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం – 2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం కింద  ప్రభుత్వం జిల్లాలో మొత్తం 2,98,472 మంది రైతులకు రూ. 326.03 కోట్ల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోందని అన్నారు. ఈ నెల 16వ తేదీన రెండు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన జిల్లాలోని 1,681,66 మంది రైతుల ఖాతాలలో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున రూ. 95.66 కోట్ల పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసిందని తెలిపారు. 17వ తేదీన మూడెకరాల వరకు సాగు భూమి ఉన్న 44,006 మంది రైతుల ఖాతాలలో రూ. 65.06 కోట్ల నిధులు, 18, 19వ తేదీలలో ఐదెకరాల లోపు సాగు భూమి కలిగిన 26,075 మంది రైతుల ఖాతాలలో రూ. 53.84 కోట్ల నిధులు జమ చేసిందని వివరించారు. తాజాగా శుక్రవారం 16958 మంది రైతుల ఖాతాలలో రూ. 45.25 కోట్ల నిధులు జమ అయ్యాయని తెలిపారు. గడిచిన ఐదు రోజులలో వరుసగా  జిల్లాలోజిల్లాలోని 2,55,205 మంది రైతుల ఖాతాలలో రూ. 259.81 కోట్ల నిధులు జమ అయ్యాయని జిల్లా పాలనాధికారి వివరించారు.

More articles

Latest article