బతుకమ్మ, మాచారెడ్డి: బైక్ పై పొలం వద్దకు వెళుతున్న ఓ రైతు కామారెడ్డి – సిరిసిల్ల రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో అక్కైడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామం లో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన గంగని రాములు (50) ఉదయం పూట వ్యవసాయ పనుల నిమిత్తం బైక్ పై వెళ్తున్నాడు. ఉదయం 5.30 గంటల సమయంలో కామారెడ్డి – సిరిసిల్ల రహదారిపై వెళుతుండగా బైక్ వెలుతురులో కనిపించక పోవడంతో చెడిపోయి రోడ్డు పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతి తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి రోజు ఉదయం చాయ్ తాగి ఆరేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఉన్న పొలానికి వెళ్లి వచ్చే వాడిని, ఇంతలో నే అకాల మరణం పొందడం విషాదాన్ని నింపింది. మృతుడికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
