29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గడ్డి మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

. . .మొక్కజొన్న పంటపై అటవి అధికారులు గడ్డి మందు పిచికారి

 గాంధారి , బతుకమ్మ :

కామారెడ్డి జిల్లాలో పోడు రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన బుధవారం జరిగింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సితాయిపల్లికి చెందిన రైతు కుర్ర చిన్న మల్లయ్య గ్రామ శివారులోని అటవి ప్రాంతంలో 30 సంవత్సరాలు సాగు చేస్తు జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం గాంధారి అటవీ రేంజ్ అధికారులు మల్లయ్య సాగు చేస్తున్న మొక్క జోన్న పంట పై గడ్డి మందు పిచికారి చేయించారు. దానిని అడ్డుకునేందుకు యత్నించిన మల్లయ్య పై అటవి అధికారులు గాంధారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అటవి అధికారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వెళ్ళిన మల్లయ్య స్థానికంగా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article