24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఎస్ఎస్ఆర్ డిస్కవరిలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్  సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని మాదవనగర్ ఎస్ ఎస్ ఆర్ డిస్కవరీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు తమ పాఠశాల విద్యను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా తొమ్మిదో తరగతి విద్యార్థులచే వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల వ్యవస్థాపకులు మారయ్య గౌడ్, సీఈవో హరిత గౌడ్ ని,  డైరెక్టర్  హర్షిత్ ని ఆహ్వానించారు.

Farewell to Class 10 students at SSR Discovery

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ పాఠశాలతో ,ఉపాధ్యాయులతో తమకు ఉన్న అనుభూతులను ,అనుభవాలను,వివరించారు.

Farewell to Class 10 students at SSR Discovery

తాము చదువుకున్నా పాఠశాలను వదిలి వెలుతున్న కారణంగా కన్నీటిపర్వంతమయ్యారు. ఈ  సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల వ్యవస్థాపకులు మాట్లాడుతూ జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైందని,భవిష్యత్తుకు పునాది అని తెలిపారు. వార్షిక పరీక్షలు దగ్గరలో ఉండడంవల్ల విద్యార్థులు సరైన ప్రణాళికతో చదివి మంచి ఫలితాలను సాధించి తమ జీవితానికి బంగారు బాట వేసుకోవాలని సూచిస్తూ,విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేశారు. అనంతరం విద్యార్థినిలు చక్కని వేషాధారణతో,అనేక సాంస్కృతి కార్యక్రమాలతో అలరించారు.

Farewell to Class 10 students at SSR Discovery

More articles

Latest article