. . . పాత ఎస్సై ట్రాన్స్ ఫర్ అయినా సమాచార హక్కు చట్టం బోర్డులో అదే పేరు
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సమాచార హక్కు చట్టం -2005 బోర్డులో పౌర సమాచార అధికారి పేరు ఇంకా మార్చలేదు. నిజామాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయినా పాత ఎస్ఐ సాయన్న పేరు ఇప్పటివరకు కూడా సమాచార హక్కు చట్టం బోర్డులో ఉండడం పట్ల పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సై మనోజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సుమారు నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ లో సమాచార హక్కు చట్టం – 2005 బోర్డులో పౌర సమాచార అధికారిగా నూతన ఎస్సై పేరు మార్చాల్సి ఉండగా, పాత ఎస్ఐ పేరు ఉండడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోలీస్ స్టేషన్ లో సమాచార హక్కు చట్టం బోర్డులో పౌర సమాచార అధికారి పేరు మార్చాలని పలువురు కోరుతున్నారు.
