24.2 C
Hyderabad

ప్రాణాలు మింగిలి వివాహేతర సంబంధం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వెబ్‌డెస్క్‌

తన కుమార్తె వేరే వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన ఆమె తన తల్లి ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపై ఉరేసుకొన్న విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో దిండుక్కల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓట్టన్‌సత్రం సమీపంలోని చిన్నకులిప్పట్టికి చెందిన పవిత్రకు తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. దంపతుల మధ్య గొడవల కారణంగా పవిత్ర పుట్టింటికి వచ్చేసింది. కొద్దినెలలుగా పవిత్ర తన కుమార్తెలు లిథిక్సా, దీపికాతో చిన్నకులిప్పట్టిలోని తల్లి కాళీశ్వరి ఇంట్లో ఉంటోంది. మంగళవారం బయటకెళ్లిన పవిత్ర తిరిగి రాలేదు. ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లిపోయినట్లు తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కాళీశ్వరి (47), తన తల్లి చెల్లమ్మాల్‌ (65)తో కలిసి మనవరాళ్లు లిథిక్సా (8), దీపికా(5)లను ఉరికి వేలాడదీసి, ఆపై వారిద్దరు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించి విచారణ చేపట్టారు. పవిత్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More articles

Latest article