. . . అభివృద్ధి, ప్రజా ఆశీర్వాదమే కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి నాంది
. . . కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సురేఖ అమర్ సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు, బోడ అనిల్ మరియు కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ ల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా ఆశీర్వాదమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతవత్ సురేఖ అమర్ సింగ్ విజయానికి నాంది పలుకుతుందని అన్నారు, గత బీఆర్ఎస్ హయాంలో వర్ని చౌరస్తా నుండి నాగారం వరకు సింగిల్ రోడ్డు, రోడ్డు వెడల్పు కు నోచుకోలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేసి, 150 కోట్లతో నిధులు కేటాయించి రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని ఇది అభివృద్ధికి నిదర్శమని అన్నారు. డివిజన్ అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. స్థానికుడు అయిన సురేఖ అమర్ సింగ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ డివిజన్లో ఉన్న మున్సిపల్ కార్మికులు, ఈఎస్ఐ హాస్పిటల్ కార్మికులు, ఎలక్ట్రిసిటీ కార్మికులను ప్రత్యక్షంగా కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గల్లీలో కూడా ఉంటే డివిజన్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. కేతావత్ సురేఖ అమర్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతావత్ సురేఖ అమర్ సింగ్, బోడ అనిల్, నరేష్, నాని, దీపక్, విజయ తదితరులు పాల్గొన్నారు.

