24.1 C
Hyderabad
Monday, August 3, 2026

డిసిసిబి, పాక్స్ పదవీకాలం పొడిగింపు

Must read

📰 Generate e-Paper Clip

  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రoలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పాలకవర్గం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘల (పాక్స్) పాలకవర్గాల పదవీకాలన్ని 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, డిసిసిబి చైర్మన్లు సత్తయ్య, రమేష్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బోజా రెడ్డి, వేంకటేశ్వర రావు, టీజీ క్యాబ్ ఎండీ గోపితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ.. సహకార సంఘాల పదవి కాలం పొడగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి, జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖకి,జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకరాలకు, రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత  కృషి చేస్తామని తెలిపారు.

Extension of tenure of DCCB, Pax

More articles

Latest article