25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మద్యం సిండికేట్ దందా పై ఎక్సైజ్‌ అధికారుల మౌనం …

Must read

📰 Generate e-Paper Clip

. . . మామూళ్ళ మత్తులో ఎక్సైజ్‌ అధికారులు

 

రుద్రూర్ బతుకమ్మ :

 

నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని వీటిని నియంత్రించాల్సిన ఎక్సెజ్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని టెన్ టు టెన్ లిక్కర్ వైన్స్ నిర్వాహకుల సిండికేట్ దందా జోరుగా కొనసాగుతోంది. ఎక్సెజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో వైన్స్ నిర్వాహకుల ఆగడాలు హద్దు అదుపు లేకుండా పోతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సెజ్ అధికారుల డ్యూటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు మండిపడుతున్నారు. ఎక్సైజ్ అధికారుల కనుసైగల్లో రుద్రూర్ మండల కేంద్రంలో వైన్స్ షాపు యజమానులు సిండికేట్‌ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టు షాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మద్యం షాపు యజమాని బెల్టు షాపుల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకొని తమ షాపులోనే మద్యం కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు. మండలంలోని వైన్స్ లోనే మద్యం కొనుగోలు చేయాలని, లేదంటే సీజ్‌ చేస్తామని ఎక్సైజ్‌ అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. ప్రభుత్వం బెల్టుషాపులు ఎత్తేస్తామని చెప్పినా ఎక్సైజ్‌ అధికారులు మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలో వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూన్నారని, బెల్ట్ షాపులను ఆశ్రయించడం వల్ల ఒక మద్యం బాటిల్ పై రూ. 10 నుంచి రూ 20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మద్యం ప్రియుల నుంచి ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మండలంలో ఉన్న వైన్స్ షాపు సిండికేట్ అయ్యి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ బెల్ట్ షాపుల ద్వారా మద్యం ప్రియుల జేబులను ఖాళీ చేస్తున్నారని పలువురు స్ధానికులు ఆరోపిస్తున్నారు.

ఎక్సైజ్ అధికారుల మౌనం..

రుద్రూర్ మండల కేంద్రంలో వైన్స్ యజమానుల సిండికేట్ వ్యాపారాన్ని చూస్తూ కూడా ఎక్సెజ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే అధిక ధరలకు మద్యం అమ్మకాల విషయంలో సీరియస్ గా ఉండాల్సిన ఎక్సెజ్ అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వహణను, అధిక ధరలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

More articles

Latest article