25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం

Must read

📰 Generate e-Paper Clip

  •  కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ఎన్నికల  కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ,ఎన్నికల అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటి విడత జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి విడతగా ఈ నెల 9న నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 జడ్పిటిసిలు, 177 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించి ఆర్.ఓలు, ఏఆర్ఓలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి బృందాలను నియమించడం జరిగిందని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సంబంధించిన రిపోర్టులను ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుందని తెలిపారు. తొలి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నవీపేట్, నిజామాబాద్, సిరికొండ జెడ్పీటీసీ స్థానాలతో పాటు, పై మండలాల పరిధి లోని 177 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

  •  ఆర్.ఓలు, ఎంపీడీఓ లతో టెలీ కాన్ఫరెన్స్ ..

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రిటర్నింగ్ అధికారులు, ఎం.పీ.డీ.ఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల ప్రక్రియను జరపాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అన్ని మండలాల్లో ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేసుకుని ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. పోస్టర్లు, బ్యానర్లు, గోడలపై రాతలను తొలగింపజేయాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో నిబంధనలను పాటించాలని, రిటర్నింగ్ అధికారులు నామినేషన్ ఫారములు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. సి.సి. కెమెరాలు, గోడ గడియారాలు, ఓటర్ల జాబితా నిర్వహణ సక్రమంగా ఉండాలని, నామినేషన్ల సమయంలో వీడియోగ్రఫీ ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. నామినేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించవలసిన అపిడవిట్లు, ధ్రువపత్రాలు, ఇతర ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, 12వ తేదీన నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అయిన నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటన,13వ తేదీన అప్పీళ్ళ స్వీకరణ, 14వ తేదీన అప్పీళ్ళ పరిష్కారం, 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 3 గంటల తరువాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రచురణ, 23వ తేదీన పోలింగ్, నవంబర్ 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Everything is ready for the conduct of local body elections.

More articles

Latest article