. . . స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
. . .. పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్, బతుకమ్మ .
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున పోన్ ట్యాఫింగ్ లో బాగం పంచుకున్న ప్రతి ఓక్కరు జైలుకు వెళ్లడం ఖాయమని పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పిసీసీ చీప్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యనించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో కోట్లు నీళ్ళల్లో పోశారు, దాంతో పాటు నాసిరకం పనులు చేశారు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనల విషయంలో కీలకమైన బనక చర్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్నారు. నాయకులు, పారిశ్రామిక వేత్తలు, జడ్జీలు, సినీ తారలు, బడా నాయకుల ఫోన్ లు 650 ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీ ఆర్ ఎస్ పార్టీది అన్నారు. ప్రభుత్వాన్ని సిట్ ను ట్యాప్ అయిన 650 మంది వాళ్ళ పేర్లు బహిర్గతం చేయాలి అని కోరారు. ట్యాప్ అయిన వాళ్ళు అంతా స్వచ్ఛందంగా విచారణకు హాజరు కావాలి అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం తోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు భావిస్తున్నాం అన్నారు. దేశ చరిత్ర లోనే అతి పెద్ద నేరం ఫోన్ ట్యాపింగ్ అని అందులో భాగం పంచుకున్న ప్రతీ ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని పిసీసీ చీప్ బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ జ్యోస్యం చెప్పారు.
సిట్ విచారణ పై నమ్మకం లేదన్న బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి
. . . ప్రభుత్వ సలహదారు మహ్మద్ షబ్బిర్ ఆలీ
పోన్ ట్యాఫింగ్ వ్యవహరంలో సిట్ విచారణ పై నమ్మకం లేదన్న బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు మాజీ మంత్రి షబ్బిర్ ఆలీ డిమాండ్ చేశారు. సిట్ విచారణ పై నమ్మకం లేదన్న బండి సంజయ్ వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం అని పేర్కోన్నారు. సిట్ పై అభ్యంతరాలు ఉంటే ముందుగా సహకరించాలి అని కోరారు.
