26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రతి వ్యక్తి కేవైసీ చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉపసర్పంచ్ ఎండి ఫారూఖ్ పటేల్

 

జుక్కల్, బతుకమ్మ :

 

మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామంలో శనివారం రేషన్ కార్డు ఈ-కేవైసీ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ ఉపసర్పంచ్ ఎండి ఫారూఖ్ పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి లబ్ధిదారుడు తమ ఆధార్ కార్డును రేషన్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం చేసుకుని ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆధార్ అనుసంధానం లేకపోతే రేషన్ బియ్యం సరఫరా నిలిపివేయబడే అవకాశం ఉందని తెలిపారు. గ్రామ ప్రజలు ఎలాంటి ఆలస్యం చేయకుండా విధిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకుని ప్రభుత్వ రేషన్ సదుపాయాలను కొనసాగించుకోవాలని ఆయన కోరారు.

More articles

Latest article