28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతిరోజు భోజనం ఇలానే ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

 

బతుకమ్మ, బిచ్కుంద :  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి శుచి శుభ్రత విషయమై పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మెచ్చుకున్నారు.ప్రతి రోజు భోజనం రుచిగా, క్వాలిటీగా ఉండాలని జిల్లా సబ్ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతో పాటు వంట గదిని, వంటకు ఉపయోగించుకునే సామాగ్రిని, పప్పు దినుసులు, బియ్యం, వంట నూనెలను ఆమె పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన ఆమె పాఠశాలలోని వసతులు, విద్యాబోధన విషయాలను, భోజనం నాణ్యత పై ఆరా తీశారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో ఏ మాత్రం క్వాలిటీ తగ్గించినా ఊరుకునేది లేదని ఆమె ఉపాధ్యాయ బృందంతో అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్, తో పాటు కేజీబీవీ ప్రీన్సిపల్ రాగిణి, పాఠశాల బోధన, బోధ నేతర పాల్గొన్నారు.

Every day's meal should be like this

More articles

Latest article