. . . 6వ వార్డు కౌన్సిలర్ గఫర్
కామారెడ్డి, బతుకమ్మ :
ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని 6వ వార్డు కౌన్సిలర్ గఫర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాల్లో 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ గఫర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని కోరారు. గతంలో ఎన్ని సార్లు పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రభుత్వం నిర్వహించే ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు మాట్లాడుతూ, పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడం అత్యంత అవసరమని తెలిపారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని పోలియో కేంద్రాలకు వెళ్లి తమ పిల్లలకు రెండు చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ అధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయించని చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, వైద్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
