తిరుమల, బతుకమ్మ : తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. దీంతో వాహనాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అలిపిరి వద్ద వాహనాల రద్దీ నెలకొంది. గరుడ వాహన సేవకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినంతరం అధికారులు కొండపైకి అనుమతిస్తున్నారు.

