హైడ్రా తరహా నిడ్రాను ఏర్పాటు చేయండి

0 3,700
  • ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

నిజామాబాద్, బతుకమ్మ :  రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులు,కుంటలు, కాల్వాలా భూముల కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూముల రక్షణకై ఏర్పాటు చేసిన హైడ్రా తరహా నిజామాబాదు లో నిడ్రాను ఏర్పాటు చేయాలనిఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య కోరారు. డిచ్పల్లి కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ జిల్లాలో గల అనేక చెరువులు, కుంటలు, కాలువల, భూములు కబ్జాలకు గురయ్యాయని అన్నారు.అక్రమంగా భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంపన్న వర్గాల వారు అట్టి భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని అన్నారు, జిల్లా కేంద్రంలో గల బొందే చెరువు, పులంగ్ వాగు, రామడు చెరువు,ఎల్లాయ్ చెరువు భూములు, డిచ్పల్లి, మోపాల్ మండల కేంద్రాలలో ఎదుల్ల చెరువు, రాజేశ్వర్ చెరువు,నాగుల కుంటల విలువైన భూములు భూకబ్జా దారుల చేతులకు వెళ్లిపోయాయని తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వ భూములపై మరియు చెరువుల, కాల్వాలా భూములపై రెవెన్యూ అధికారులకు,ఇరిగేషన్, మున్సిపాలిటీ వారి దృష్టికి లేకపోవడం మూలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ఆక్రమించుకున్నారని తెలిపారు. వారు చేస్తున్న ప్లాట్లకు, ఆ భూములను రోడ్డు గానీ ప్లాట్ చేసి అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. ఈ రియల్ వ్యాపారుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని  అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆస్తులను, భూములను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందని వెంటనే వారి కబంధహస్తాల నుంచి అట్టి భూములను విడిపించి వాటి రక్షణకై నిలబడాలని నిడ్రా సంస్థను ఏర్పాటు చేయాలని మా అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రభుత్వాన్ని కోరుతుందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి జేపీ గంగాధర్,పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, ప్రభాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.