హైడ్రా తరహా నిడ్రాను ఏర్పాటు చేయండి
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్, బతుకమ్మ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులు,కుంటలు, కాల్వాలా భూముల కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూముల రక్షణకై ఏర్పాటు చేసిన హైడ్రా తరహా నిజామాబాదు లో నిడ్రాను ఏర్పాటు చేయాలనిఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య కోరారు. డిచ్పల్లి కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గల అనేక చెరువులు, కుంటలు, కాలువల, భూములు కబ్జాలకు గురయ్యాయని అన్నారు.అక్రమంగా భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు,...