అసైన్డ్ భూమికే ఎసరు

0 99,804
  • రికార్డులున్నా కొట్టేసేందుకు కుటిలయత్నం
  • సర్వేయర్ ఇచ్చిన మ్యాప్ తో భూమి కబ్జాకు యత్నం
  • అవదూత నిర్మలానందస్వామి భూమి కబ్జాలో ట్విస్టులే ట్విస్టులు

నిజామాబాద్, బతుకమ్మ –ప్రభుత్వం పేదలకు ఇతర అవసరాల కోసం ఇచ్చిన భూమి ( అసైండ్ ) ని కబ్జా చేయడం అసాధ్యం. అదే విధంగా అన్నీ రకాల పత్రాలున్న ముఖ్యంగా పోడి, టిపాన్ ప్రతులు ఉన్న కూడా ఆ భూమిని కబ్జా చేయడం కుదరదు. ధరణి పోర్టల్ లో ఉంటే దానిని కబ్జా చేయడం దుస్సాధ్యం. ఇక రైతుబంధుతో పాటు అక్కడ సాగు కార్యకలాపాలు సాగుతుంటే కబ్జా చేయడం ఎవరి తరం కాదు. అయితే ఒక సాధువుకు ఇచ్చిన భూమిని స్థానికంగా ప్రధాన పార్టీల నాయకులు చెరబట్టేందుకు యత్నిస్తున్న ఘటన కలకలం రేపుతుంది. ప్రధానంగా మోపాల్ మండలంలోని సిర్పూర్ లో అవధూత నిర్మలానందస్వామి ఆలియాస్ ఏ.ఎన్.స్వామి అనే వ్యక్తికి 1984లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన భూమిని మోపాల్ మండలంకు చెందిన నేతలు చెరబట్టడం కలకలం రేపుతుంది. ప్రధానంగా స్థానికంగా ఉన్న నాయకులే ధర్జాగా కబ్జా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మండలంలోని సిర్పూర్ గ్రామంలోని ముదక్ పల్లి గ్రామానికి చెందిన ఏఎన్ స్వామి ఆలియాస్ అవదూత నిర్మలానందస్వామికి 1984లో మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 602/110, 602/111లో ఐదు ఎకరాల భూమిని కేటాయించారు. స్వామివారు వ్యవసాయం చేయలేని స్థితిలో కొందరి వ్యక్తుల సహాయంతో సాగును చేస్తున్నారు. ఆరోగ్యరీత్యా వయస్సు పైబడడంతో కొన్ని రోజులు గా నిజామాబాద్ నగరంలో ఉండి సంబంధిత భూమి సాగు చేయలేకపోయారు. కరోనా సమయంలో అక్కడికి వెళ్లకపోవడంతో సాగు కోసం సహయం చేసిన వ్యక్తుల్లో కబ్జాకు యత్నించారు. దానిపై స్వామివారు కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దానిపై గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులను స్వామివారు ఆశ్రయించడంతో భూమిని ఇప్పిస్తామని ఏడాది పాటు చర్చలు అంటూ పొడగించారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ఏకమై కబ్జా భూమిని చెరబట్టారు. దాంతో స్వామి స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో ఆయన సిఫారసు మేరకు రెవెన్యూ అధికారులు సర్వేకు ఉపక్రమించారు.
రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులను చూపిస్తామని చేపట్టిన చర్యలు స్వామి భూమికే ఎసరుతెచ్చిపెట్టాయి. ముందుగా భూమి ఎక్కడో ఉందో సర్వే చేసి హద్దులు చూపించాల్సిన రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు మాత్రం ముందస్తుగా ఒప్పందం మేరకు స్వామికి భూమిని కాకుండా చేసే ప్రయత్నంలో భాగస్వాములు కావడం గమనార్హం. ధరణి పోర్టల్ లో, అడంగల్ పహాణి ప్రకారం సబ్ డివిజన్ల నంబర్ల వివరాలు ఒక విధంగా ఉండగా ఏడి సర్వే ల్యాండ్ రికార్డు ప్రకారం వేరుగా ఉన్నాయి. సర్వే నంబర్ 602/110, 602/111లో ఉన్న భూములు కాకుండా 602/112, 602/113, 602/114, 602/115 అన్న సబ్ డివిజన్ల ప్రకారం భూమి కాదని కొత్త మ్యాప్ ను ఇచ్చారు. మ్యాప్ ప్రకారం అక్కడ స్వామి వారి సాగుకు మంగళం పాడారు. దానితో బాధితుడు తహసీల్ధార్ తో పాటు పోలీసు,రెవెన్యూ,జిల్లా అధికారుల చుట్టు చక్కర్లు కొడుతున్న ఇప్పటి వరకు న్యాయం జరుగలేదు. తాజాగా పోలీస్ స్టేషన్ కు గానీస్థానికంగా లీడర్ల వద్దకు వెళ్తే లీడర్లు ఇచ్చినంత తీసుకుని సర్ధుబాటు చేసుకోవాలని సెటిల్ మెంట్ చేయడం గమనార్హం.

Esaru to the assigned land

Leave A Reply

Your email address will not be published.