- కోటగిరి నుండి పోచారం సురేందర్ రెడ్డి ఓటును తొలగించాలి
- పురుషుడిని ట్రాన్స్ జెండర్లో చూపించడం సిగ్గుచేటు
- కోటగిరి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్
బతుకమ్మ, కోటగిరి : తప్పులతడకగా ఉన్న ఓటర్ లిస్టును అధికారులు వెంటనే సరి చేయాలని కోటగిరి మండలం బిజెపి పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్ కోరారు. కోటగిరి గ్రామానికి చెందిన ఓటర్ లిస్టులో ఉన్న తప్పులను చూయిస్తూ సోమవారం స్థానిక తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కోటగిరి గ్రామానికి చెందిన ఓ పురుషుడికి ట్రాన్స్ జెండర్ గా ఓటర్ లిస్టులో చూపించడం సిగ్గుచేటన్నారు. పోచారం సురేందర్ రెడ్డికి కోటగిరిలో నివాసం లేకపోయినా ఓటు ఎలా వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. వెంటనే ఆయన ఓటును ఓటర్ లిస్ట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. చాలామందికి డబుల్ ఓట్లు వచ్చాయని డబుల్ ఓట్లను అధికారులు వెంటనే సరి చేయాలని కోరారు. ఓటర్ లిస్టులో చనిపోయిన వారివి సైతం 50 కి పైగా ఓట్లు ఉన్నాయని వారిని ఓటర్ లిస్ట్ నుండి డిలీట్ చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు హౌగిరిరావు దేశాయ్,మామిడి శ్రీనివాస్,వడ్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

