26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రపహాడ్ గ్రామ సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎర్రపహాడ్ గ్రామ సర్పంచ్ సోంటికె మల్లవ్వ – బీరయ్య దంపతులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎర్రపహాడ్ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ విశేష కృషి చేశారని తెలిపారు. గ్రామంలోని పాఠశాలల మరమ్మతుల కోసం రూ.17 లక్షల నిధులతో పెయింటింగ్ పనులు చేపట్టడం, గ్రామానికి రూ.20 లక్షల సీసీ రోడ్లను మంజూరు చేయడం, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, గృహ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Errapahad Village Sarpanch joins Congress Party.

More articles

Latest article