24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బాలరత్న పురస్కారం అందుకున్న ఏర్గట్ల విద్యార్థి నూనె శ్రీనిధి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: బాలలదినోత్సవాన్ని పురస్కరించుకొని కమలాకర మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం బాలరత్న పురస్కారం అందివ్వడం ఆనవాయితీ. 2024 సంవత్సరానికి గాను ఏర్గట్ల పాఠశాల లో 8 వ తరగతి చదువుతున్న నూనె శ్రీనిధి బాలరత్న,పురస్కారాన్ని అందుకుంది.కరాటే రంగంలో కూడా చక్కని ప్రతిభ కనబరిచి అనేక ప్రశంసలు పొందడమే కాక బ్లాక్ బెల్ట్ సాధించడం, సాహిత్య రంగంలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నందుకు, ఈ పురస్కారాన్ని హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో మంగళవారం సాయంత్రం పురస్కార సభలో ముఖ్య అతిథులు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్టర్ ఆచార్య గౌరీ శంకర్, హైకోర్టు అడ్వకేట్, ఆర్టిఐ పూర్వ కమిషనర్ విజయ బాబు,చేతుల మీదుగా బాలరత్న పురస్కారాన్ని అందుకున్నదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి తెలిపారు.ఇంత గొప్ప పురస్కారాన్ని సంపాదించడమే కాకుండా ఏర్గట్ల పాఠశాల పేరును,ఏర్గట్ల గ్రామ పేరును దశ దిశల వ్యాప్తి చేసి అందరి మన్ననలు పొందిన నూనె శ్రీనిధి ని పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్,పవన్ ప్రసాద్, ప్రవీణ్ శర్మ,రాజనర్సయ్య, రాజేందర్,గంగాధర్, రాజశేఖర్, శ్రీనివాస్,సబిత, ఇందిర,నరేష్,రాజగోపాల్, ట్వింకిల్,జ్యోతి,ఏర్గట్ల గ్రామస్తులు అభినందించారు.

More articles

Latest article