బాలరత్న పురస్కారం అందుకున్న ఏర్గట్ల విద్యార్థి నూనె శ్రీనిధి

బతుకమ్మ, ఏర్గట్ల: బాలలదినోత్సవాన్ని పురస్కరించుకొని కమలాకర మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం బాలరత్న పురస్కారం అందివ్వడం ఆనవాయితీ. 2024 సంవత్సరానికి గాను ఏర్గట్ల పాఠశాల లో 8 వ తరగతి చదువుతున్న నూనె శ్రీనిధి బాలరత్న,పురస్కారాన్ని అందుకుంది.కరాటే రంగంలో కూడా చక్కని ప్రతిభ కనబరిచి అనేక ప్రశంసలు పొందడమే కాక బ్లాక్ బెల్ట్ సాధించడం, సాహిత్య రంగంలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నందుకు, ఈ పురస్కారాన్ని హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ...