32.7 C
Hyderabad

సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

పాలమూరు – రంగారెడ్డి, సీతారామ సాగర్, దిండి, గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టులకు ఆరు నెలల్లో పర్యావరణ అనుమతులు సాధించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేయాలని సూచిస్తూ, 7 రోజుల్లో నోడల్ అధికారుల నియామకం, 30 రోజుల్లో నివేదికల సమర్పణకు గడువులు విధించారు. అలాగే గౌరవెల్లి పంప్‌హౌస్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని, పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే ముంపుపై శాస్త్రీయ అధ్యయనం చేసి కేంద్రం నుంచి పరిహారం కోరాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

More articles

Latest article