. . . రెవెన్యూ అధికారికి తెలంగాణ రక్షణ సేన వినతి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా రైతులు ధాన్యానికి సరైన ధర కల్పించాలి, ధాన్యం కోనుగోళ్లలో పారదర్శకత, సిఏంఆర్ వ్యవహరంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ గురువారం జిల్లా ఆర్డీవోకు తెలంగాణ రక్షణ సేన సమితి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన వరి పంటను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నేరుగా రైతుల పంట పోల్లాల్లో మంచి మద్దతు ధర చేల్లించి వడ్లు కోంటుంటే, నిజామాబాద్ జిల్లా కు చెందిన కొందరు రైస్ మిల్ ఆసోసెషియన్ నాయకులు, వడ్లు కొంటున్న ప్రవైట్ వ్యకులను బెదిరించడం జరుగుతుందని ఆరోపించారు. వారు బెదిరించడంతో రెండు రోజుల నుంచి వడ్ల ధర పడిపోయిందని రైతులు వాపోతున్నారు. ఏదైతే వడ్లను ధర ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తున్న వారిని గ్రామలల్లోకి రాకుండా బెదిరించిన వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు మార్కెట్ లో నడుస్తున్న 3500 నుండి 4000 వరకు మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరారు.
