29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆంగ్ల భాషా నైపుణ్యం పని భారాన్ని తగ్గిస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రిన్సిపాల్ జి. రాంబాబు

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో “సిఈఎల్ టి (సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్)” కార్యక్రమాన్ని “కనెక్ట్ @ వర్క్” థీమ్‌తో ఫిబ్రవరి 18 నుండి ఏప్రిల్ 28 వరకు 21 డే ప్రొగ్రామ్ యూనివర్సిటీ నాన్- టీచింగ్ స్టాఫ్ కు తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం నాన్-టీచింగ్ సిబ్బందికి ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది. ఈ శిక్షణ లో పాల్గొన్న సిబ్బందికి ఇంగ్లీష్ పై అవగాహనతో పాటు రాయడం, మాట్లాడడం వంటి నైపుణ్యాల్లో అవగాహన కలిగించారు. ఈ శిక్షణా తరగతులను ఆంగ్ల విభాగ అధ్యాపకులు డాక్టర్ పి. సమత,డాక్టర్ కె.వి.రమణాచారి, డాక్టర్ ఎల్. జోష్ణ, డాక్టర్. ఎన్. స్వామిలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన వాలెడిక్టరీ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆంగ్ల భాష నైపుణ్యాలు మీ పనిని సులభతరం చేస్తాయని పేర్కొన్నారు. తరువాత కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.సి.హెచ్ లక్ష్మణ చక్రవర్తి, సిఈఎల్ టి, డైరక్టర్ డా.పి సమత, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా.కె.వి.రమణాచారి, అధ్యాపకులు డా. జోష్న, డా.స్వామి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article