24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఉద్యోగులు హక్కుల  సాధన కోసం ఉద్యమించాలి

Must read

📰 Generate e-Paper Clip

. . .  టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్

బతుకమ్మ, నిజామాబాద్

ఉద్యోగులందరూ  టీఎన్జీవో కేంద్ర సంఘం ఇచ్చిన సూచనల మేరకు ఉద్యోగుల హక్కుల సాధన కొరకై  ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను పాటిస్తూ, ఉద్యమించాల్సిన అవసరం ఉందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు.  టీఎన్జీవో జిల్లా కార్యాలయం లో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన, టీఎన్జీవో  అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ  సందర్భంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ జిల్లా ఉద్యోగులందరూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడుట కోసం సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని, త్వరలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై రాష్ట్ర జేఏసీ మీటింగ్లో చర్చించి ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామన్నారు. దీనికి ఉద్యోగ లోకం సమిష్టిగా సహకరించి హక్కుల సాధన కొరకు ఉద్యమించుటకు నడుం బిగించాలన్నారు. ఈ సమావేశానికి టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికై, మొదటిసారి జిల్లాకు విచ్చేస్తున్న మారం జగదీశ్వర్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.హుస్సెని (ముజీబ్) లకు సన్మానం చేశారు. ఈ సమావేశంలో  గైని గంగారాం , టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోల శ్రీనివాస్,  ఎం.సతీష్, టీజీవో జిల్లా అధ్యక్షులు సంఘం అమృత్ కుమార్ , జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి , ముఖ్య సలహాదారులు ఆకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article