ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి టీఎన్జీవోస్ యూనిట్ అధ్యక్షులు లచ్చిగారి మహిపాల్ అధ్యక్షతన వారి బృందం ఎల్లారెడ్డి నూతనంగా ఎన్నికైనా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ను మర్యదపూర్వకంగా కలిసారు. సొమవారం మున్సిపల్ కార్యాలయంలో కొత్త చైర్మెన్ కు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఐ సి.డి.యస్ ఉద్యోగులు కూడా మున్సిపల్ కార్యాలయంలోని ఉద్యోగుల టీఎన్జీవోస్ ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీహరిరాజ్, టీఎన్జీవోస్ కార్యదర్శి వరాల శరన్ కుమార్, ఉపాధ్యక్షురాలు వసంతలక్ష్మి, జాయింట్ సెక్రెటరీలు స్వాతి, జాయింట్ సెక్రటరీ రాజగౌడ్, అరుణ్, ముకీదు, రవి, నర్సింలు లతో పటు మున్సిపల్ కౌన్సిలర్లు, ఐ. సి.డి.యస్ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు కలిసి పాల్గొన్నారు.
