- జిల్లా కలెక్టర్ కు బీసీటీయూ వినతి
బతుకమ్మ , నిజామాబాద్ సిటీ : విద్యార్థులు ఉన్నత చదువుల విషయంలో బీసీలకు జారీ చేసే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ల జారీల విషయంలో జరుగుతున్న ఇబ్బందులను తొలగించాలని బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో తహసీల్ధార్ల ద్వారా జారీ అవుతున్న బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ల విషయంలో 8 లక్షల గరిష్ట ఆధాయ పరిమితి, భార్యభర్తల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక వేతనం పొందుతున్నప్పుడు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో తహసీల్ధార్లు జాప్యం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తహసీల్ధార్లకు క్రిమిలేయర్ సర్టిఫికెట్ల జారీ విషయంలో అవగాహన కల్పించడంతో పాటు వెంటవెంటనే సర్టిఫికెట్ల జారీకి ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాఘవ పాల్గొన్నారు.