24.7 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యుత్ అధికారుల పొలం బాట

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూరు, బతుకమ్మ :

భిక్కనూరు మండలంలోని భిక్కనూరు శివారు పెద్దమల్లారెడ్డి రోడ్డు లో విద్యుత్ అధికారులు శనివారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఏఈ సంకిర్త్ మాట్లాడుతూ మోటర్ లకు కెపాసిటర్లను బిగించుకోవాలని సూచించారు. కెపాసిటర్ బిగించుకోవడం వల్ల మోటార్ కాలిపోకుండా ఉంటాయని సూచించారు. రైతులకు విద్యుత్ సరఫరా, మోటార్ సమస్యలు,కెపాసిటర్ వాడకం వంటి వాటిపై అవగాహన కల్పించారు. పొలాలలో విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, వేణు, బాలరాజు, మాణిక్యం విద్యుత్ అధికారులు రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article