నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆదేశానుసారం, నాంపల్లి లోని టీఎన్జీవో కేంద్ర సంఘ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నిజామాబాద్ టిఎన్జీవో అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులుగా టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ను కో ఆప్షన్ పద్దతిన ఎన్నుకున్నారు. టీఎన్జీవో నియమావళి ప్రకారం జిల్లా సహాధ్యక్షులుగా పెద్దోళ్ల నాగరాజును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీజీఓ అధ్యక్షులు అలుక కిషన్, టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్, టీఎన్జీవో కేంద్ర బాధ్యులు గైని గంగారం, పోల శ్రీనివాస్, మచ్చకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, టీఎన్జీవో సలహాదారులు ఆకుల ప్రసాద్, టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా జిల్లా కార్యవర్గ సభ్యులు, పాల్గొన్నారు.

