నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం మున్నూరు కాపు నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ కార్యనిర్వాహక కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు అలా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే వివరాలను సేకరించామని తెలిపారు. ఈ వివరాలన్నీ రాష్ట్ర స్థాయిలో ఉన్న మున్నూరు కాపు సంఘ అపెక్స్ కమిటీకి నివేదిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన కులగణనలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయం గురించి సమాజానికి వివరిస్తామని తెలిపారు. జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో, నియోజకవర్గానికి ఆరుగురు చొప్పున రాష్ట్ర మున్నూరు కాపు సంఘ ఎన్నికల కార్యనిర్వాహక కమిటీ ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. గుజరాత్ లో మాదిరిగా పటేల్ ఉద్యమం తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి ‘పటేల్ గెజిట్’ తెప్పిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే జనాభా గణన కార్యక్రమంలో భాగంగా కులగలను కూడా చేపట్టవలసిందని మోదీ నిర్ణయం స్వాగతిస్తున్నామని కులగణన కార్యక్రమంలో మున్నూరు కాపులు వివరాలు ఇచ్చే సమయంలో వారిని పేరు చివర ‘పటేల్’ అని చేర్చి రాయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ రూరల్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు: దాసరి లక్ష్మీనరసయ్య పటేల్, సంబారి మోహన్ పటేల్, ఆకుల తిరుమల పటేల్, కోర్వ దేవేందర్ పటేల్, పులి సాగర్ పటేల్, పుప్పాల శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ అర్బన్ కమిటీ : కిషన్ రెడ్డి పటేల్, నర్సింగ్ రావు పటేల్, సంతోష్ వైసాక్షి పటేల్, బొబ్బిలి నర్సయ్య పటేల్, న్యాలం రాజు పటేల్, అగ్గు షేర్ సంతోష్ పటేల్.
బాల్కొండ కమిటీ : జక్కా రాజేశ్వర్, గుల్లే రాజేశ్వర్, చెంగల్ మహేష్, నెల్ల లింగన్న , పుప్పాల నరేశ్, రేగుంట దేవేందర్.
