. . .టిఆర్ఎస్ పేరును ఇవ్వలేం
. . . పేరు మార్చుకోవాలన్న ఈ సి
హైదరాబాద్, బతుకమ్మ:
టిఆర్ఎస్ బ్రాండ్ నేమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కల్వకుంట్ల కవితకు ఎలక్షన్ కమిషన్ రెండోసారి షాకిచ్చింది. తెలంగాణలో తన భవిష్యత్తు కోసం స్థాపించిన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన( టిఆర్ఎస్) పేరును కవితకు కేటాయించేందుకు రెండోసారి నో చెప్పింది. ఈ మేరకు కవితకు టిఆర్ఎస్ పేరును కేటాయించడం కుదరదు. రాబోయే పక్షం రోజుల్లో కొత్తగా మూడు పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ కల్వకుంట్ల కవితకు అధికారికంగా రాసిన లేఖ అందింది. టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన తరువాత కవిత గతంలో ఐదు పేర్లతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో ఆ పేరు కలిసి వచ్చేలా కవిత ఈ సి కి ఐదు పేర్లు తొలుత దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ ఐనా కారణంగా కవితకు అ పేరు ఇవ్వడం సాధ్యం కాదని ఆమె ఇచ్చిన పేర్లు ఒకటైన తెలంగాణ రక్షణ సేన పేరును ఖరారు చేసేందుకు గాను అభ్యంతరాలు స్వీకరించింది. కానీ అభ్యంతరాల స్వీకరించిన కాలంలో టీఆర్ఎస్ పేరును స్పూరించేలా ఉన్న తెలంగాణ రక్షణ సేన పేరును కవితకు కేటాయించేందుకు చాలా అభ్యంతరాలు వచ్చినట్లు ఈసి తెలిపింది. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కూడా దరఖాస్తుతో పాటు మరో 700 వరకు అభ్యంతరాలు రావడంతో రెండోస్సారి కూడా టీఆర్ఎస్ పేరును కవితకు ఇచ్చేందుకు ఈసి సారి చెప్పేసింది. ఇటివల కాలంలో కవిత తెలంగాణ రక్షణ సేన పేరు ఖచ్చితంగా వస్తుందని పార్టీ కార్యాలయం ఏర్పాటుతో పాటు కమిటిల ఏర్పాటు, జండా పండుగలు, నిరసనలు అన్ని టీఆర్ఎస్ పేరు మీదనే చేసిన విషయం విధితమే
టీఆర్ఎస్ పేరు కోసం న్యాయపోరాటం చేస్తాం… కవిత
ఎలక్షన్ కమిషన్ గతంలో సూచించినట్లుగా తెలంగాణ రక్షణ సేన పేరును వచ్చాం. ఇప్పుడు అభ్యంతరాల పేరుతో టీఆర్ఎస్ ను ఇవ్వమంటే కుదరదు. గతంలో ఉన్న ఈసి నిబంధనల మేరకు దరఖాస్తు చేశాం. ఈ సి అభ్యంతరాల మీద న్యాయ పోరాటం చేస్తాం. టీఆర్ఎస్ పేరు మీదనే రాజకీయం చేస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు.
