26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా బిఎల్ఎ లు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఎ) కోసం ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఓటర్ల జాబితా కీలకమని పేర్కొన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నవీన్ పెట్టాం, ఏఎంసీ చైర్మన్ లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఎల్ఎ ల ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

 

Efforts must be made to ensure that every voter's name is included in the list.

More articles

Latest article