24.8 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యను ప్రజాస్వామ్యం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • డీటీయూ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు యాదవ్

నిజామాబాద్, బతుకమ్మ : విద్యను ప్రజాస్వామ్యం చేయాలని డీటీయూ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు యాదవ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల దీపక్ గార్డెన్స్ లో డీటీయూ జిల్లా ఆవిర్భావ సభను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ప్రముఖ సామాజికవేత్త, ఉపాధ్యా సంఘ బాధ్యులు, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు యాదవ్ మాట్లాడారు. దేశంలో ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన సమాన విద్యనందించాలని, విద్యను ప్రజాస్వామ్యం చేయాలని అన్నారు.

Education should be democratised

మహనీయుల ఆలోచన విధానంతో డీటీయూ ముందుకెళ్తుందని, విద్యారంగ సమస్యలను, ఉపాధ్యాయ సమస్యలను, పరిష్కరించేందుకు డీటీయూ కృషి చేస్తుందని తెలిపారు. నిజామాబాద్ ఎంఈఎ సేవ్ల నాయక్ మాట్లాడుతూ డీటీయూ మంచి భావాలతో సామాజిక స్పూర్తితో ముందుకెళ్తుందిని అన్నారు. ఇది చాలా గొప్ప పరిణామమని, ఇదే స్పూర్తితో కొనసాగాలని అన్నారు. ఈ సమాజానికి డీటీయూ ఆలోచన అత్యవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పాక లింగమల్లు యాదవ్, ప్రధానకార్యదర్శులు ఉపేందర్, సుధాకర్, ఉపాధ్యక్షులు అశోక్,రమేష్, కార్యదర్శులు హరికిషన్,సిద్దంకి బాబు, సాయినాథ్, స్వప్న, నవ్య, జిల్లా ప్రతినిధులు నాగేశ్వరరావు, సాయినాథ్, రమేష్, సుదర్శన్, వినోద్, ప్రసాద్, సుధాకర్, సురేష్, మోహన్,పోషన్నా, సుధాకర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Education should be democratised

 

More articles

Latest article