విద్యను ప్రజాస్వామ్యం చేయాలి
డీటీయూ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు యాదవ్ నిజామాబాద్, బతుకమ్మ : విద్యను ప్రజాస్వామ్యం చేయాలని డీటీయూ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు యాదవ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల దీపక్ గార్డెన్స్ లో డీటీయూ జిల్లా ఆవిర్భావ సభను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ప్రముఖ సామాజికవేత్త, ఉపాధ్యా సంఘ బాధ్యులు, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు యాదవ్ మాట్లాడారు. దేశంలో ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన సమాన విద్యనందించాలని, విద్యను ప్రజాస్వామ్యం చేయాలని అన్నారు. మహనీయుల ఆలోచన విధానంతో డీటీయూ ముందుకెళ్తుందని, విద్యారంగ సమస్యలను,...