27.3 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్

 

దర్పల్లి, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలాల్లో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా పిడిఎస్యు విద్యార్థి నాయకులు ధర్పల్లి లో పలు స్కూలను సందర్శించారు. ఈ సందర్భంగా టీ యు సీ ఐ కార్యదర్శి రమేష్, పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ ముఖ్య వ్యక్తలుగా హాజరై ప్రసంగించారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని, పేద విద్యార్థులకు విద్యను అందకుండా చూస్తున్నాయన్నారు. ప్రభుత్వాల స్వార్థపూరిత నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ కుటీలమవుతొందని, అందుకే ప్రభుత్వ కళాశాల ,పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ కార్పొరేట్ విద్య సంస్థల దోపిడీని అరికట్టాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు. అందుకే పిడిఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకుంటుందని.అందులో బాగానే ఆర్మూర్ నుండి మొదలైనటువంటి ఈ విద్యార్థి పోరుబాట నేడు ధర్పల్లి మండలానికి వచ్చిందన్నారు. కావున విద్యార్థులు,  మేధావులు అందరూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యావ్యవస్థను కాపాడుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దుర్గాప్రసాద్ ,ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు నిఖిల్ ,ఏరియా నాయకులు రుచిత, వివేక్, వినయ్ వెంకట్, బాలు మరియు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article