ఉత్కృష్ట అవార్డుకు హోంగార్డు మారుతి ఎంపిక

0 18,593

బతుకమ్మ, పిట్లం : గ్రామంలో మహిళా ఆత్మహత్యాన్ని చకచకంగా పిట్లం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు మారుతి పోలీసులు అభినందించారు. ప్రాణాలు పణంగా పెట్టి, విలువైన జీవితాన్ని కాపాడిన పిట్లం పోలీస్ స్టేషన్లో హోంగార్డు మారుతి అరుదైన గౌరవం దక్కింది.’ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్కృష్ట పోలీస్ పతకానికి ఆయన ఎంపికయ్యారు. ఈ గుర్తింపు ఆయన అంకితభావానికి, ధైర్యానికి నిదర్శనం. 20,4,2025 పిట్లం గ్రామానికి చెందిన సావిత్రి అనే వివాహిత మండల కేంద్రంలోని ఊర చెరువులో ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన చూసి యువకులు 100కు డయల్ చేయగా వెంటనే స్పందించిన హోంగార్డు మారుతి చెరువు దగ్గరికి వెళ్లి ఇవాయితను ప్రాణాలకు తెగించి కాపాడారు. ఉత్కృష్ట పథకం అందిస్తున్నందుకు పోలీస్ శాఖ ఉన్నత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.