25.2 C
Hyderabad

గొర్రెల కేసులో ఈడీ దూకుడు

Must read

📰 Generate e-Paper Clip

  • అధికారుల అరెస్టులు, నోటీసులు

 

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్‌లో మరోసారి గొర్రెల కేసు దుమారం రేపుతోంది. పశుసంవర్ధక శాఖలో జరిగిన భారీ అవకతవకలపై ఇప్పటికే ఏసీబీ విచారణ సాగుతుండగా, ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ అధికారులు 15న హాజరుకావాలని సంబంధిత బాధితులకు నోటీసులు జారీ చేశారు. ఏసీబీ సేకరించిన ఆధారాలపై చర్యలు చేపడుతున్న ఈడీ, డబ్బు లావాదేవీల కోణంలో విస్తృతంగా విచారణ ప్రారంభించింది. గొర్రెలు కొనకుండానే కోట్లు కొట్టేశారని, అధికారులు–బ్రోకర్లు కుమ్మక్కై వేల కోట్ల నిధులు స్వాహా చేశారని ఏసీబీ ఇప్పటికే ఆరోపించింది. ఈ వ్యవహారంలో పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు అరెస్టవ్వగా, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీపై కూడా కేసు నమోదైంది.

More articles

Latest article