24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కేసిఆర్ హయంలోటియుఎఫ్ఐడీసీ  100 కోట్ల నిధులు తీసుకువచ్చాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  సంబంధించిన నిధులతో 90 శాతం పనులకు భూమి పూజ చేశాం

. . .  వంద కోట్లు తెచ్చానని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ చెప్పుకోవడం సమంజసం కాదు

. . .  బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ధ్వజం

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

నిజామాబాద్ అర్బన్  ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగర అభివృద్ధి కోసం 100 కోట్లు నిధులు తీసుకువచ్చానని ప్రకటించారు.కానీ అవి ఆయన తెచ్చిన వి కాదని నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జి జి కాలేజ్ గ్రౌండ్ మీటింగ్ లో నిజామాబాద్ పట్టణ పనుల కోసం 100 కోట్ల నిధులు ప్రకటించారు అని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గుర్తు చేశారు. మంగళవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బిగాల మాట్లాడుతూ….  అనాడు కేసీఆర్ ఇచ్చిన నిధులతో దాదాపు 90 శాతం పనులకు భూమిపూజ చేసాము, ధన్ పాల్ సూర్యనారాయణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మా హయం లో వచ్చినటువంటి 100 కోట్ల నిధులు తాను తెచ్చానని చెప్పుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు అన్నారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో సుమారు 100 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి నగర అభివృద్ధి చేస్తున్నట్లు చేసిన ప్రకటనలను ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన 100 కోట్ల నిధులతో నగరంలోని 60 డివిజన్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వాటికి పునాదులు వేసి శిలాఫలకాలు ఏర్పాటు చేశామని అప్పటి నిధుల నుండి  చేపడుతున్న పనులకు నేను తీసుకు వచ్చానని ఇప్పటి ఎమ్మెల్యే ప్రచారం చేసుకోవడం సబబు కాదని అన్నారు. మా హయాంలో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని ఇప్పటి ఎమ్మెల్యే నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోయినా మేము చేసిన పనులను కొనసాగించిన సరిపోతుందని అన్నారు. నగరంలో కంటేశ్వర్ నుండి బొర్గం వరకు ఏర్పాటు చేసిన సెంటర్ మీడియాన్ లలోని కనీసం 20% కూడా స్ట్రీట్ లైట్స్ పనిచేయడం లేదని, నాటిన మొక్కలకు నీరు పొసే నాథుడు లేడని, కాలనీలలో స్ట్రీట్ లైట్స్ పని చేయడం లేదని విమర్శించారు. ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్ (బొడ్డెమ్మ చెరువు) వద్ద ఊడ్చే నాథుడు లేడని, లైట్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని అన్నారు. అభివృద్ధి లో పోటీపడి మా కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ ప్రజలకు సేవ చేసే విధంగా పని చేయాలని హితవు పలికారు. మా హయాంలో వచ్చిన నిధులను తానే తీసుకువచ్చినట్లు చేసుకుంటున్న ప్రచారాన్ని ఖండించి 100 కోట్లు కేసీఆర్ ప్రకటించినందుకు అనాడు నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీ ఫోటోలు  ప్రదర్శించారు.

More articles

Latest article