27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బాన్సువాడలో చెత్తతో నిండిన మోరీలు…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎండలు దంచికొడుతున్నా వదలని దోమల బెడద

 

. . . డ్రైనేజీల క్లీనింగ్, ఫాగింగ్ లేక అవస్థలు

 

. . . లైట్ తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు

 

. . . ఇబ్బందులు పడుతున్న పట్టణ జనాలు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో దోమల బెడద ఎక్కువైంది. సాధారణంగా వానకాలంలో దోమల విజృంభణకు అవకాశం ఉండగా, ఎండకాలంలోనూ తిప్పలు తప్పడం లేదు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం తొలగించడం, మురుగునీటిలో దోమలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన మున్సిపల్ సిబ్బంది నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ లోపమే ఇందుకు ముఖ్యకారణంగా తెలుస్తున్నది. పట్టణంలోని పలు కాలనీల్లో మురుగుకాల్వలు దోమలకు నిలయంగా మారాయి. సిబ్బంది డ్రైనేజీలు క్లీన్ చేయకపోవడంతో ప్రజలే  చేసుకోకతప్పడం లేదు. ఫిర్యాదులు చేస్తే నామమాత్రంగా ఫాగింగ్ చేసి వెళ్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దోమల నియంత్రణకు చర్యలు చేపట్టి, సక్రమంగా డ్రైనేజీ తీయించడంతో పాటు ఫాగింగ్ చేయించడంపై దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

 

Dumpsters full of garbage in Banswada...

 

More articles

Latest article