29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బెంజ్ కారులో డ్రగ్స్ అక్రమ రవాణా

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  బెంజ్ కారులో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ శివార్లలో ఓ కారు నుంచి రూ. 15 లక్షల విలువైన హైబ్రిడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 31న వివిధ ఫాంహౌజ్ లలో నిర్వహించనున్న రేవ్ పార్టీల నిర్వహకులకు ఈమాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అర్చిత్ అగర్వాల్ అనే డ్రగ్స్ సరఫరాదారు తన డ్రైవర్ కు రూ. 10 చెల్లించి అతడి సహాయంతో కొనుగోలు దారుల వద్దకు డ్రగ్స్ కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈకేసులో ఇద్దరి అరెస్టు చేయగగా అగర్వాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

More articles

Latest article