- రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి పై విమర్శల
- పోచారం కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఖబర్దార్
- కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
బాన్సువాడ , బతుకమ్మ : రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తికి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ బిక్షపెడితే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు బీర్కూర్ మాజీ జడ్పిటి సభ్యులు ద్రోణవల్లి సతీష్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం మల్లాపూర్ లో కాంగ్రెస్ ప్రజాపతినిధులు, నాయకులు, కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుమారుల కంటే ఎక్కువగా ద్రోణవల్లి సతీష్ కు ప్రాముఖ్యత ఇస్తే అది ఆసరాగా తీసుకొని మండలంలో నియంత పాలన సాగిస్తూ, చిన్న చితిక నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడింది వాస్తవమా కాదా అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. 1994 కంటే మీ ఆస్తులన్నీ ఎన్ని ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు రావడానికి కారణం పోచారం శ్రీనివాస్ రెడ్డి కాదా అంటూ మాజీ జెడ్పిటి సభ్యులు ద్రోణవల్లి సతీష్ కు ప్రశ్న వేశారు. అన్నం పెట్టిన అన్నదాతను విమర్శిస్తావా పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు నీకు చేసిన అన్యాయం ఏమిటి 30 ఏళ్ల పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట తిరిగి తన పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకోలేదా రాజకీయ గురువైన పోచారం శ్రీనివాస్ రెడ్డిని వదిలివేసి, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు, విమర్శలు చేయడానికి నీకు నోరు ఎలా వచ్చింది అంటూ కాంగ్రెస్ నాయకులు, ద్రోణవల్లి సతీష్ ను ప్రశ్నించారు. ఉమ్మడి బీర్కూరు మండలాన్ని 30 ఏళ్లుగా నీ చేతిలో పెడితే నువ్వు ఏం చేశావు, ఎంతమంది కార్యకర్తల పై దాడులు పాల్పడ్డావు. అంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీకి దూరమైతే నీకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు, ఇసుక మాఫియా చేసి ఆస్తులు సంపాదించుకోలేదా కోట్లాది రూపాయల కాంట్రాక్టర్ పనులు చేసి ఎన్ని డబ్బులు వెనుక వేసుకున్నావో మాకు తెలుసు అంటూ కాంగ్రెస్ నాయకులు, ద్రోణవల్లి సతీష్ పై ఘాటు వ్యాఖ్యలకు దిగారు. మండలంలో ఏ నాయకుడిని, ఏ కార్యకర్తలు ఏది ఎదగనివ్వకుండా నియంత పాలన చేసిన వ్యక్తివి నువ్వు కాదా? అంటూ వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండలంలో ఏ కార్యకర్తకు ఎక్కడ విలువ ఇచ్చావు ఎవర్ని గౌరవించావు అంటూ వారు ప్రశ్నించారు. మండలంలో నియంత పాలన సాగించి పోచారం శ్రీనివాసరెడ్డి కి చెడ్డ పేరు తీసుకురావడానికి పాల్పడ్డా ద్రోణవల్లి సతీష్, పోచారం కుటుంబ సభ్యులపై ముఖ్యంగా భాస్కర్ రెడ్డి పై ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అంటూ మండల కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. పోచారం పుణ్యమాని మార్కెట్ కమిటీ చైర్మన్గా, జెడ్పిటిసి సభ్యులుగా పదవులు చేయడమే కాకుండా ఉమ్మడి బీర్పూర్ మండలాన్ని మీ చేతిలో పెట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి చివరి సమయంలో ద్రోహం చేస్తావా ఇది నీ గుండె మీద చెయ్యి పెట్టుకుని చెప్పు అంటూ వారు ఆరోపణలకు దిగారు. 30 ఏళ్ల పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట తిరిగి ఒక జిల్లాలోని నాయకుడిగా గుర్తింపు వచ్చిందా లేక నీ సొంత బలంతో నాయకుడిగా గుర్తింపు వచ్చిందా ఒక్కసారి ఆలోచించుకో? ఉమ్మడి మండలంలో ఏ నాయకుడిని రాజకీయంగా ఎదిగనివ్వకుండా అడ్డుపడి, వారి జీవితాలతో ఆడుకున్న ఘనత నీది అంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రెండు పడక గదులు నిర్మించింది నీ సొంత డబ్బులతోనా లేక పోచారం శ్రీనివాసరెడ్డి మంజూరు చేస్తే వచ్చిన ఇండ్లను నిర్మించలేదా ఇప్పుడు నేనే మండలంలో రెండు పడక గదులను నిర్మించాలని గొప్పగా చెప్పుకుంటున్నాం అది ఎంతవరకు సమంజసం అంటూ మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయ బిక్ష పెట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఎప్పటికీ మర్చిపోకుండా నీవు రుణపడి ఉండాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. లేనిపోని ఆరోపణ చేస్తే సహించేది లేదంటూ మరో మారు కాంగ్రెస్ నాయకులు ,సతీష్ ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దుర్గం శ్యామల, వైస్ చైర్మన్ యామ రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్, మాజీ మండల అధ్యక్షుడు రఘు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సందీప్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఆరిఫ్, మాజీ సర్పంచ్ సానెపు గంగారం, తిమ్మాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ. యువజన నాయకులు శశికాంత్, దుంపల రాజు, కోర్మే రఘు, సాహెబ్ రావు, మాజీ మండల అధ్యక్షుడు విట్టల్, బీర్కూర్, నసుల్లాబాద్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
