నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్
నగరంలో పలు ప్రాంతాల సందర్శన
నిజామాబాద్, బతుకమ్మ : డ్రెయినేజీలతో పాటు డీ-54 కెనాల్ ను ఎప్పటికప్పుడూ శుభ్రం చేయాలని పారిశుధ్య కార్మికులకు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. నగరంలోని పలు ప్రాంతాలను శుక్రవారం ఆయన సందర్శించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టి లో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. కమిషనర్ వెంట ఏఎంసీ జయకుమార్, ఇన్ చార్జి మున్సిపల్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు.
